Seyon | కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సియోన్’ (Seyon) నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో భాగ్యశ్రీ అచ్చమైన గ్రామీణ యువతిగా, నీలి రంగు చుడిదార్ ధరించి, నుదుట కుంకుమ మరియు జడలో మల్లెపూలతో ఎంతో సహజంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె చేతిలో నెమలి ఈక పట్టుకుని సీరియస్ లుక్‌తో ఎవరినో హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న హావభావాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గాజుల దుకాణం నేపథ్యంలో ఉన్న ఈ లుక్ చూస్తుంటే ఇది పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ మాస్ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది.
లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం శివకార్తికేయన్ కెరీర్లో మరో విభిన్నమైన ప్రయత్నంగా నిలవనుంది. తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో గుర్తింపు పొందిన భాగ్యశ్రీ బోర్సేకు ఇది కోలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్ కాగా, ఈ చిత్రం 2026 అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Team #Seyon proudly welcomes the talented #BhagyashriBorse on board and wishes her a very happy birthday! 🎉 #HappyBirthdayBhagyashri#OneMoreTime#KamalHaasan #Sivakarthikeyan@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Dir_SivakumarM @Music_Santhosh #BhagyashriBorse @RKFI… pic.twitter.com/s6RegXdFNP
— BA Raju’s Team (@baraju_SuperHit) May 6, 2026