హృతిక్ శౌర్య, తాన్వీ నేగి జంటగా నటిస్తున్న సినిమా ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ఉపశీర్షిక. ఫ్లిక్నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కె.రాఘవేంద్రరావు క్లాసిక్ ‘పదహారేళ్ల వయసు’ సినిమాలోని ‘సిరిమల్లెపువ్వా..’ పాటను సింగర్ సునీత పాడగా రీమిక్స్ చేశారు. ఆ పాటను కె.రాఘవేంద్రరావు లాంచ్ చేశారు. ఈ పాటలో తాన్వీ నేగి అద్భుతంగా నటించిందని, ఈ పాట సినిమాకు హైలైట్గా నిలుస్తుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు కెమెరా రాజశేఖర్, సంగీతం అగస్త్య.