Siri Vs Shanmukh | బాత్రూమ్కు వెళ్లి తలుపేసుకున్న సిరి..షణ్ముక్‌తో గొడవ ఫలితం..!
బిగ్ బాస్ ఇంట్లో (Bigg Boss Season 5 Telugu) చాలా చిత్రాలు జరుగుతున్నాయి. నామినేషన్స్ సమయంలో ఒకరినొకరు విమర్శలు చేసుకున్నా కూడా ఆ తర్వాత కలిసి ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ స్నేహితుల్లా కనిపిస్తూనే లోపల మాత్రం ఒకరిపై ఒకరు కోపంగా ఉంటారు.

బిగ్ బాస్ ఇంట్లో (Bigg Boss Season 5 Telugu) చాలా చిత్రాలు జరుగుతున్నాయి. నామినేషన్స్ సమయంలో ఒకరినొకరు విమర్శలు చేసుకున్నా కూడా ఆ తర్వాత కలిసి ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ స్నేహితుల్లా కనిపిస్తూనే లోపల మాత్రం ఒకరిపై ఒకరు కోపంగా ఉంటారు. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇంట్లో అతడికి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ సిరి. దాంతో ఎప్పుడూ ఆమెను టార్గెట్ చేస్తూ ఉంటాడు షణ్ముక్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తనకు ఎప్పుడూ కోపం వచ్చినా కూడా స్నేహితులపై అలుగుతూ ఉంటాడు. తాజాగా సిరిపై అలగడమే కాకుండా..తనను చాలా లోతుగా హర్ట్ చేశాడు. బిగ్ బాస్ 5 తెలుగు మొదలైన రోజు నుంచి ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న షణ్ముఖ్ జస్వంత్, సిరి (Siri Hanmanth) మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
టాస్క్ లో భాగంగా తనకు సపోర్ట్ చేయలేదు అని కోపంతో సిరిపై అలిగాడు షణ్ముఖ్ జస్వంత్. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అని పరిస్థితిని వివరించడానికి సిరి ఎంత ప్రయత్నించినా కూడా వినిపించుకోడానికి షణ్ముఖ్ ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. పైగా వెళ్లిపో అంటూ మొహం మీదే మూడు నాలుగు సార్లు చెప్పాడు. దాంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి బాత్రూంకు వెళ్లి డోర్ వేసుకుంది సిరి. తన మైక్ బయట పెట్టేసి లోపలికి వెళ్లి లాక్ చేసుకుంది.
కాసేపు చూసిన తర్వాత బాత్రూమ్ డోర్ దగ్గరికి వచ్చిన షణ్ముఖ్ సిరిని పిలిచాడు. అయినా లోపలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో కంగారు పడి ఇంటి సభ్యులు అందరూ వాష్ రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కెప్టెన్ రవి డోర్ దగ్గరికి వచ్చి మూడు నాలుగు సార్లు పిలిచినా కూడా సిరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ ఎపిసోడ్ అంతా ఆసక్తికరంగా ఉంది. ప్రోమోలో ఈ ఒక్క సీన్ హైలెట్ చేశారు. అసలు ఎందుకు షణ్ముఖ్ జస్వంత్, సిరి మధ్య మనస్పర్థలు వచ్చాయి అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Puneeth Rajkumar Award | దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

