ఆ పేరు శాశ్వతం కాదు
‘భార్యలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనలో ఉన్న యాభై ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ఓ ప్రముఖ గాయని పట్ల ఆకర్షితులైన వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు ప్రముఖ గాయకుడు మనో. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ.సత్తిబాబు దర్శకుడు. గురువారం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో మనో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ నటుడిగా నేను గ్యాప్ తీసుకోలేదు. అనుకోకుండా వచ్చింది. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ద్వారా సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు రావడం ఆనందంగా ఉంది. మనసుకు ఆనందాన్ని పంచే చిత్రమిది.
ఇందులో నేను బంగారం షాపు ఓనర్‌గా నటించా. నిజజీవితంలో నేను చాలా జోవియల్‌గా ఉంటూ చుట్టుపక్కల వారందరినీ నవ్విస్తుంటాను. అలాంటి పాత్రను ఈ సినిమాలో చేశాను. నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. నేపథ్య గాయకుడిగా ఇప్పటివరకు పదమూడు భాషల్లో 25వేలకుపైగా పాటలు పాడాను. ప్రస్తుతం ట్రెండ్ మారడంతో గాయకుడిగా నా స్పీడు తగ్గింది. గతంలో మద్రాస్‌లో సినీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉండటంతో అందరికీ అవకాశాలొచ్చాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అన్ని రాష్ర్టాల్లో విస్తరించడం, సామాజిక మాధ్యమాల కారణంగా పోటీ పెరిగింది. ఇంతకుముందు ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య చక్కటి సంబంధాలుండేవి. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం యూట్యూబ్ కారణంగా ప్రతి ఒక్కరూ గాయకులుగా తక్కువ వ్యవధిలోనే పాపులర్ అవుతున్నారు.
కానీ అలా వచ్చే పేరుప్రఖ్యాతులు శాశ్వతం కాదు. క్రమశిక్షణ, చక్కటి ప్రవర్తన కలిగి ఉండటంతో పాటు సాధన చేయడం ముఖ్యం. అప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకుంటారు. భవిష్యత్తులో కామెడీ ప్రధానంగా సాగే మరిన్ని మంచి పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో అవకాశాలొచ్చాయి. ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిపై ఓ నిర్ణయానికి వస్తాను’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


