Chinmayi | అందుకు కారణం అధికారం, రాజకీయ బలం, డబ్బు.. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై గాయని చిన్మయి వ్యాఖ్య
Singer Chinmayi | హేమ కమిటీ రిపోర్ట్‌పై (Hema Committee report) ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) స్పందించారు.
Singer Chinmayi | ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై సోషల్‌మీడియా వేదికగా తరచూ గళం విప్పుతూ ఉంటారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాలను ట్విట్టర్ వేదికగా ఎండగడుతుంటారు. ఇక మీటూ ఉద్యమకాలం నుంచి స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం కోసం గొంతెత్తుతూ.. ఫైర్‌బ్రాండ్‌గా పేరు తేచ్చుకున్నారు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తమిళ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టించాయి.
చిత్ర పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’పై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్మయి.. తాజాగా హేమ కమిటీ రిపోర్ట్‌పై (Hema Committee report) స్పందించారు. ఈ సందర్భంగా కమిటీ పనితీరును ఆమె ప్రశంసించారు. విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపారు. ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిన్మయి మాట్లాడుతూ.. ‘వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ వల్లే ఇది సాధ్యమైంది. ముందుగా డబ్లూసీసీకి హ్యాట్సాఫ్. ఇప్పటి వరకూ ఇలాంటిది ఏ చిత్ర పరిశ్రమలోనూ జరగలేదు. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉంటానేది బహిరంగ రహస్యం. సినిమా పరిశ్రమకు ఏదో ఒక విధంగా చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇక్కడ లైంగిక వేధింపులు సర్వసాధారణమని అందరూ నమ్ముతారు. ఇలాంటి ఘటన జరిగిందని చెప్పినా నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడం లేదు. సమస్య గురించి ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కేసు సంవత్సరాలపాటు సాగుతూనే ఉంటుంది. అందుకు కారణం అధికారం, రాజకీయ బలం, డబ్బు. వాటి వల్లే నేరస్తులను శిక్షించడం కష్టంగా మారుతోంది’ అని చిన్మయి తెలిపారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని కూడా చిన్మయి గుర్తు చేసుకున్నారు. ‘నేను తమిళ పాటల రచయిత వైరముత్తు నుంచి స్వయంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. అతడి గురించి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడాను. అందుకు ఆ పరిశ్రమలో నేను పనిచేయకుండా చేశాడు’ అంటూ చెప్పుకొచ్చారు.
చిన్మయి.. ఐదేళ్ల క్రితం మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. తమిళ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు దక్షిణాదిన సంచలనం సృష్టించాయి. తమిళ ఇండస్ట్రీ ఆమెపై నిషేధం కూడా విధించింది. దాదాపు నాలుగేళ్ల నిషేధం తర్వాత గతేడాది అక్టోబర్‌లో తమిళ ఇండస్ట్రీలోకి ఆమె మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. ఓ చిత్రంలో హీరోయిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది. విజయ్ (Vijay) హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లియో’ (Leo). ఇందులో త్రిష (Trisha) పాత్రకు చిన్మయి గాత్రం అందించింది. తమిళం, తెలుగు, కన్నడలో డబ్బింగ్ చెప్పింది. మరోవైపు వైరముత్తు లైంగిక వేధింపుల కేసులో న్యాయం కోసం చిన్మయి పోరాటం సాగిస్తూనే ఉంది.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఆ అంశాన్ని స్టడీ చేసేందుకు కేరళ సర్కారు హేమా కమీషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి కే హేమా.. ఆ కమీషన్‌కు నాయకత్వం వహించారు. నటి శారదతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అఫిషియల్ కేబీ వాత్సల కుమారి ఆ కమీషన్లో సభ్యులుగా ఉన్నారు. ఆ కమీషన్ ఇటీవలే తన నివేదికను సీఎం విజయన్‌కు సమర్పించింది.
మలయాళం సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళా ప్రొఫెషనల్స్ లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నది. అమానవీయ ప్రవర్తనకు బాధితులుగా ఉన్నారని తెలిపింది. ఇండస్ట్రీని కొంత మందితో కూడిన ఒక ‘క్రిమినల్ గ్యాంగ్’ నియంత్రిస్తున్నదని పేర్కొన్న కమిటీ.. లొంగని మహిళలను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని వెల్లడించింది. కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ మధ్య ఒప్పందం ఉన్నదని కమిటీ నివేదిక ఆరోపించింది. 2017లో ఓ నటిపై దాడి కేసు తర్వాత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read..
Kangana Ranaut | అన్నదాతల ఆందోళనను బంగ్లాదేశ్ అలజడితో పోల్చిన కంగనా రనౌత్
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?
Aamir Khan | ‘లాల్ సింగ్ చద్దా’ నా వల్లే ఫ్లాప్ అయ్యింది : ఆమీర్ ఖాన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

