Simbu | ఆ సినిమా కోసం కేవలం పది రోజుల్లో పది కిలోల బరువు తగ్గిన శింబు
Simbu | తమిళ సినీ పరిశ్రమలో తన టాలెంట్‌తో ఎంతగానో ఆకట్టుకుంటున్న నటుడు శిలంబరసన్ అలియాస్ శింబు. కొన్నేళ్ల క్రితం వరకూ వ్యక్తిగత వివాదాలతో, కెరీర్ లో అంతగా ఎదగలేకపోయాడు. ఇప్పుడు మాత్రం తన దృష్టి అంతా సినిమాలపై ఉంచుతూ చాలా డెడికేషన్‌తో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శింబు, పేరున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.
Simbu | తమిళ సినీ పరిశ్రమలో తన టాలెంట్‌తో ఎంతగానో ఆకట్టుకుంటున్న నటుడు శిలంబరసన్ అలియాస్ శింబు. కొన్నేళ్ల క్రితం వరకూ వ్యక్తిగత వివాదాలతో, కెరీర్ లో అంతగా ఎదగలేకపోయాడు. ఇప్పుడు మాత్రం తన దృష్టి అంతా సినిమాలపై ఉంచుతూ చాలా డెడికేషన్‌తో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శింబు, పేరున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. గతంలో ధనుష్‌తో కలిసి వడ చెన్నై వంటి కల్ట్ క్లాసిక్‌ను తెరకెక్కించిన వెట్రిమారన్, అదే బ్యాక్‌డ్రాప్‌తో శింబు కోసం కొత్త కథను సిద్ధం చేశాడు. ఈ సినిమా కోసం వెట్రిమారన్, వడ చెన్నై రైట్స్‌ను కూడా ధనుష్ నుంచి అధికారికంగా తీసుకున్నట్లు సమాచారం.
ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే, ఈ సినిమాలోని పాత్ర కోసం శింబు కేవలం 10 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గాడు! ఇప్పటికే ‘థగ్ లైఫ్’లో నాజూకు లుక్‌లో కనిపించిన శింబు, ఇప్పుడు వెట్రిమారన్ సినిమాలో మరింత బక్కగా కనిపించనున్నాడట. పాత్ర డిమాండ్ చేయడంతో శింబు కష్టపడి బరువు తగ్గాడు. శింబు బరువు సినిమాలోని పాత్రల కోసం తరచుగా మారుతూనే ఉంటుంది. కొన్ని పాత్రల కోసం బరువు పెరిగితే, మరికొన్నింటి కోసం బరువు తగ్గుతాడు. ఉదాహరణకు, ‘మానాడు’ సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాడు. మరొక సినిమా కోసం 13 కేజీలు తగ్గినట్టు సమాచారం.. అయితే, కొన్ని పాత్రల కోసం బరువు పెరిగే అవసరం కూడా ఉంటుంది, ఉదాహరణకు, ‘అన్బానవన్ అసరాదవన్ అడంగదవన్’ సినిమాలో ఒక వృద్ధుడి పాత్ర కోసం బరువు పెరిగారు.
ఇప్పుడు వెట్రిమారన్ సినిమా కోసం ఏకంగా 10 కేజీల బరువు తగ్గాడు. చిత్రంలో శింబు పాత్ర అత్యంత నేచురల్‌గా ఉంటుందట. ఇంతకుముందు ‘వడ చెన్నై 2’ ధనుష్‌తో చేయాలని భావించిన వెట్రిమారన్, అది కుదరకపోవడంతో కొత్త కథను తీసుకుని, శింబుతో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇందులో మరో విశేషం ఏంటంటే, ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుండగా, సెట్స్‌పైకి ఈ నెలాఖరులోపే వెళ్లే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

