SIIMA: సైమాలో అల వైకుంఠపురములో హవా.. పది అవార్డులు దక్కించుకున్న బన్నీ చిత్రం

అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రం నాన్ బాహుబలి మూవీగా ఎన్ని రికార్డులు తిరగరాసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా సైమా అవార్డ్ వేడుకలో అల వైకుంఠపురములో చిత్రం ఏకంగా పది అవార్డులు ఎగరేసుకుపోయింది.
ఆదివారం సైమా 2020 అవార్డుల జాబితా ప్రకటించగా, ఇందులో సైమా ఉత్తమ చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ అవార్డు గెలుచుకుంది. ఇదే సినిమాకిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, త్రివిక్రమ్ ఉత్తమ దర్శకుడిగా, తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, పూజా హెగ్డే ఉత్తమ నటిగా, మురళీ శర్మ ఉత్తమ సహాయ నటుడిగా, టబు ఉత్తమ సహాయ నటిగా, సముద్ర ఖని ఉత్తమ విలన్‌గా, రామజోగయ్యశాస్త్రి ఉత్తమ పాటల రచయితగా (బుట్టబొమ్మా), అర్మాన్ మాలిక్ ఉత్తమ గాయకుడి (బుట్టబొమ్మా)గా అవార్డును అందుకున్నారు.
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌ని జీవిత సాఫల్య పురస్కారం (2019) వరించింది. దీనిని చిరంజీవి, రాధిక చేతుల మీదుగా అందించారు. ఇక లెజెండరీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకి సైమా ఘన నివాళి అర్పించింది.
సైమా 2020 అవార్డుల జాబితా చూస్తే..
ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో (హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & గీతా ఆర్ట్స్)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సుధీర్‌బాబు (వి)
ఉత్తమ నటి: పూజా హెగ్డే (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)
ఉత్తమ దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి: టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. థమన్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)
ఉత్తమ గాయకుడు: అర్మాన్ మాలిక్(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)
ఉత్తమ గాయని: మధుప్రియ (హి ఈజ్ సో క్యూట్-సరిలేరు నీకెవ్వరు)
ఉత్తమ విలన్: సముద్రఖని (అల వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ఆర్. రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు)
ఉత్తమ కమెడియన్: వెన్నెల కిషోర్ (భీష్మ)
ఉత్తమ తొలి పరిచయ హీరో: శివ కందుకూరి (చూసి చూడంగానే..)
ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: రూప కొడువయూర్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: కరుణ కుమార్ (పలాస 1978)
ఉత్తమ తొలి పరిచయ నిర్మాత: అమృత ప్రొడక్షన్స్ అండ్ లౌక్య ఎంటర్టైన్మెంట్స్ (కలర్‌ఫొటో)
Lifetime Achievement Award (Telugu) 2019 is presented to Kalatapaswi#KViswanath Garu by MegaStar @KChiruTweets @realradikaa at #SIIMA #SIIMA2019 #SIIMA2021 pic.twitter.com/MQ0PJRTjtE
— BA Raju's Team (@baraju_SuperHit) September 19, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

