‘ఒక రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కుపోయి జీవితాన్ని ఇబ్బందులపాలు చేసుకున్న ఓ జీనియస్ కథ ‘సిద్దార్థ్ రాయ్’. అతని ఎమోషన్, అతని ప్రేమ భరించడం కష్టం. ఆకలితోవున్న ఒక నటుడికి ఇంతకంటే మంచి పాత్ర వస్తుందా? అనిపించింది. కథ విన్నాక ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి’ అన్నాడు హీరో దీపక్ సరోజ్. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సిద్దార్థ్రాయ్’. తాన్వి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మాతలు.
నేడు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథులుగా వచ్చిన కిరణ్ అబ్బవరం, కోనవెంకట్, నక్కిన త్రినాథరావు చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఇంకా దీపక్ సరోజ్ మాట్లాడుతూ ‘ నన్ను నేను నిరూపించుకోటానికే ఈ సినిమా చేశాను. సాంకేతికంగా అద్భుతంగా ఉంటుందీ సినిమా’ అని తెలిపారు దీపక్ రాజ్. సినిమాలపై ఉన్న ప్రేమతో ఈ రంగంలోకి వచ్చానని, నా ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలని దర్శకుడు చెప్పారు. ఇంకా హీరోయిన్ తన్వి కూడా మాట్లాడారు.