సందీప్ అశ్వా, సానియా ఠాకూర్, జోయా ఝవేరి, తరుణ్‌సాగర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రిస్క్’. ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘సొగసుకే సోకు’ అనే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు ఘంటాడి కృష్ణ సంగీతాన్నందించారు. తెలుగు మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత యలమంచిలి రవి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ ‘వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని కమర్షియల్ అంశాలతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. అర్జున్ ఠాకూర్, అనీష్ కురువిళ్ల, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ కొమరి, నిర్మాణ సంస్థ: జీకే మిరకిల్స్.