ప్రేమ, పెళ్లి విషయాల్లో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. గతంలో డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికాతో సుదీర్ఘ ప్రేమాయణం నడిపిందీ భామ. వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అనంతర పరిణామాల్లో ఈ జంట విడిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నటనపై దృష్టి పెట్టింది శృతిహాసన్.
సెలెక్టివ్‌గా సినిమాల్ని ఎంచుకుంటున్నది. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన బ్రేకప్ స్టోరీని పంచుకుంది. తాను ఇప్పటివరకు ఆరుసార్లు విఫల ప్రేమ అనుభవాల్ని చవిచూశానని, వాటివల్ల మానసిక సంఘర్షణకు లోనయ్యానని చెప్పింది. ప్రస్తుతం సినిమాలే ప్రపంచంగా ప్రశాంత జీవితం గడుపుతున్నానని, ఇక మీదట తాను ఒంటరిగానే ఉంటానని శృతిహాసన్ తెలిపింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.