‘ఆషికీ’ స్వరకర్త శ్రవణ్ కన్నుమూత

బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు శ్రవణ్ రాథోడ్(66) గురువారం కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గత కొద్ది రోజులుగా ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో శ్రవణ్ గురువారం రాత్రి 10.15 సమయంలో తుదిశ్వాసవిడిచారు. నదీమ్ అక్తర్ సైఫీతో కలిసి శ్రవణ్ రాథోడ్ బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 1990 దశకంలో నదీమ్-శ్రవణ్ ద్వయం అజరామరమైన గీతాలతో సంగీత ప్రియుల్ని అలరించింది. 1990లో మహేష్‌భట్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికీ’ చిత్రంతో వీరి విజయప్రస్థానం ప్రారంభమైంది. ఇందులో నదీమ్-శ్రవణ్ స్వరపరచిన ప్రతి పాట ఓ ఆణిముత్యమే. బాలీవుడ్లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బమ్‌గా ‘ఆషికీ’ చరిత్ర సృష్టించడంతో ఈ సంగీతద్వయం పేరు మారుమోగింది . వీరిద్దరి కలయికలో వచ్చిన సాజన్, పూల్ ఔర్ కాంటే, సడక్, దీవానా, రంగ్, దిల్వాలే, హమ్ హై రహి ప్యార్ కే, రాజా, బర్సాత్, అగ్నిసాక్షి, రాజా హిందుస్థానీ, పరదేశీ, దడ్కన్, రాజ్, దిల్ కా రిస్తా, కసూర్, అందాజ్, సిర్ఫ్‌తుమ్, దిల్ హై తుమారాతో చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. పాశ్చాత్య సంగీత పోకడలకు దూరంగా హిందుస్థానీ సంగీతానికి ప్రాముఖ్యతనిస్తూ స్వరాల్ని సమకూర్చేవారు నదీమ్-శ్రవణ్.
2005లో అభిప్రాయభేదాలతో ఈ సంగీతద్వయం విడిపోయారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలిసి ఓ సినిమాకు సంగీతాన్ని అందించినా ఆ స్నేహబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. నదీమ్ నుంచి విడిపోయిన తర్వాత శ్రవణ్ తన తనయులు సంజీవ్, దర్శన్‌లతో కలిసి కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించారు. శ్రవణ్ మరణంతో బాలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రవణ్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రవణ్ మరణం ఎంతగానో బాధించిందని.. 90 దశకంలో తమ బాణీలతో సంచలనం సృష్టించిన గొప్ప స్వరకర్త శ్రవణ్ అని అక్షయ్‌కుమార్ నివాళులు అర్పించారు. శ్రవణ్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని గాయని శ్రేయాఘోషల్ పేర్కొంది. ఇటీవలే శ్రవణ్ తన భార్యతో కలిసి హరిద్వార్ కుంభమేళాకు వెళ్లొచ్చారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఆయన కరోనా బారిన పడినట్లు తనయుడు సంజీవ్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

