సనాతన ధర్మంలో దాగివున్న రహస్యాల ఆధారంగా రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’. శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రధారి. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక, శ్రీనివాస్ నిర్మాతలు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయని, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందిందని, సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల కలబోత ఈ సినిమా అని మేకర్స్ చెబుతున్నారు.
మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పవన్ చెన్న, సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, సమర్పణ: చాగంటి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ.