మైథలాజికల్ ఫాంటసీ ‘కూర్మ అవతార్’
‘కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అనే పట్టింపులు నాకుండవు. కథ నచ్చితే చాలు. దర్శకుడిపై నమ్మకం ఉంచి సినిమా చేస్తాను. డైరెక్టర్ హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమా తీశారు సాయికుమార్, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలు ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
‘కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అనే పట్టింపులు నాకుండవు. కథ నచ్చితే చాలు. దర్శకుడిపై నమ్మకం ఉంచి సినిమా చేస్తాను. డైరెక్టర్ హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమా తీశారు సాయికుమార్, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలు ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్ అన్నారు.
ఆయన ప్రధానపాత్ర పోషించిన చిత్రం ‘కూర్మ అవతార్’. రాజ్ తరుణ్, సాయికుమార్, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రధారులు. హర్షవర్ధన్ కడియాల దర్శకుడు. పూజిత , సేవిత నిర్మాతలు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో శివరాజ్‌కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దిల్‌రాజు చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. శివరాజ్‌కుమార్‌తో కలిసి పనిచేయడం పట్ల హీరో రాజ్‌తరుణ్ ఆనందం వెలిబుచ్చారు. ‘దర్శకునిగా ఇది నా తొలి చిత్రం. అయినా.. నన్ను, నా కథనూ నమ్మి నాతో నడిచి, నన్ను నడిపించిన చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని దర్శకుడు హర్షవర్ధన్ అన్నారు. ఇంకా సాయికుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, నిర్మాతలు నరేంద్ర, పూజిత, సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

