Ram Chran 16 Movie | ఆర్సీ16లో కన్నడ స్టార్ హీరో.?
Shivaraj Kumar | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan), ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సాన (BuchiBabuSana) కలయికలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు.
Shivaraj Kumar | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan), ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సాన (BuchiBabuSana) కలయికలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక ‘ఆర్సీ 16’ అని వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రలో జరిగే క్రీడా నేపథ్యంలో రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారికి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్లో నటించనున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఈ రోల్ కోసం విజయ్ సేతుపతిని అనుకున్నా… శివ రాజ్ కుమార్ అయితే బాగా సెట్టవుతాడని, ఆయన్నే ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు నెరేషన్ కూడా జరిగిపోయిందని తెలుస్తుంది. ఇలా మొత్తానికి రామ్ చరణ్-బుచ్చిబాబు కలిసి నెక్స్ట్ లెవల్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహామాన్ స్వరాలు సమకూర్చనున్నాడు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర కుర్రాడిగా కనిపించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

