Irumudi | ‘ఇరుముడి’ టీచర్ వివాదంపై శివ నిర్వాణ క్లారిటీ.. ఆ ఒక్కరి గురించే చెప్పానంటూ కామెంట్
Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైనప్పటి నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో విజయవంతంగా కొనసాగుతోంది.
Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైనప్పటి నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఒకవైపు సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ‘ఇరుముడి’పై వివాదం కూడా కొనసాగుతోంది. సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఓ మహిళా టీచర్ పాత్రను నెగెటివ్‌గా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశాయి.
ఈ వివాదంపై తాజాగా దర్శకుడు శివ నిర్వాణ స్పందించి తన ఉద్దేశాన్ని వివరించారు. ‘ఇరుముడి’లో టీచర్ పాత్రపై వస్తున్న విమర్శలకు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో మొత్తం టీచర్లను తప్పుగా చూపించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.ప్రతి వ్యవస్థలోనూ ఎక్కువ మంది మంచివాళ్లు ఉంటారని, అయితే కొందరు చెడ్డ వ్యక్తులు కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. సినిమాలో అలాంటి ఒక వ్యక్తి గురించి మాత్రమే చూపించామని, మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థను తప్పుపట్టలేదని వివరించారు. ప్రతి సిస్టమ్‌లో 90 శాతం మంచివాళ్లు ఉండొచ్చు. కానీ విష పురుగులు కూడా ఉంటాయి. 99 మంది మంచివాళ్లు ఉండొచ్చు. కానీ మిగిలిన ఆ ఒక్కరి దగ్గరే మన కూతురు పడితే ఏంటి? ‘ఇరుముడి’ సినిమాలో ఆ ఒక్కరి గురించే నేను చెప్పాను. మిగతా వాళ్ల గురించి కాదు” అని శివ నిర్వాణ వివరించారు.
తనకు ఉపాధ్యాయ వృత్తిపై ఎంతో గౌరవం ఉందని చెప్పేందుకు శివ నిర్వాణ తన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించారు. తాను ఎంఎస్సీ, బీఈడీ చదివానని, కొంతకాలం టీచర్‌గా కూడా పనిచేశానని తెలిపారు.అంతేకాదు.. తన స్నేహితులు, శ్రేయోభిలాషుల్లో చాలామంది టీచర్లేనని చెప్పారు. తాను ఉపాధ్యాయులను కించపరిచే ఉద్దేశంతో సినిమా తీయలేదని స్పష్టం చేశారు.నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరూ టీచర్లే. ఈ సినిమా తీసినందుకు నా సీనియర్ టీచర్లు, కొలీగ్స్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. నేను ఎవరినో కించపరచాలనేది నా ఉద్దేశం కాదు అని శివ నిర్వాణ తెలిపారు. సినిమాలో వివాదాస్పదంగా మారిన సన్నివేశాల వెనుక తన ఆలోచన ఏంటో కూడా దర్శకుడు వివరించారు. అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎదుర్కొనే సమస్యలు, కొందరు వ్యక్తుల వల్ల జరిగే వేధింపులు, అకృత్యాల గురించి ప్రేక్షకులకు బలంగా చెప్పాలనుకున్నానని తెలిపారు.
కొన్ని విషయాలను చాలా సున్నితంగా చెబితే ప్రేక్షకులపై అంత ప్రభావం ఉండకపోవచ్చని, అందుకే కథను హార్డ్ హిట్టింగ్‌గా తెరకెక్కించానని చెప్పారు. చదువుకునే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే బస్సులో, స్కూల్లో.. ఎక్కడైనా ప్రాబ్లమ్ రావొచ్చు. కొందరు వ్యక్తుల వల్లే ఆడపిల్లలపై అకృత్యాలు జరుగుతుంటాయి. వీటన్నిటినీ చాలా హార్డ్ హిట్టింగ్‌గా చెప్పాలని డిసైడ్ అయ్యాను. కొన్ని విషయాలు లైట్‌గా చెప్తే తలకు ఎక్కవు. కథను హార్డ్ హిట్టింగ్‌గా చెబితేనే మనల్ని థియేటర్లలో కుదిపేస్తాయి” అని శివ నిర్వాణ అన్నారు. సినిమాలో కేవలం నెగెటివ్ టీచర్ పాత్ర మాత్రమే లేదని, మంచి టీచర్ పాత్రను కూడా చూపించామని శివ నిర్వాణ గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఓ టీచర్ తనకు స్వయంగా చెప్పిన సందర్భాన్ని కూడా ఆయన వెల్లడించారు. మొన్న నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ ఒక టీచర్ నా దగ్గరకు వచ్చి.. ‘సార్, సినిమా చాలా బాగా తీశారు. కానీ టీచర్ సీన్స్ నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాయి. గవర్నమెంట్ స్కూల్, సేమ్ యూనిఫామ్స్ ఉన్నాయి’ అని అన్నారు.
అప్పుడు సినిమా ప్రారంభంలోనే విలేజ్‌లోని ఎలిమెంటరీ స్కూల్లో ఒక మంచి టీచర్ ఉంటాడని, అతన్ని ఆమె గమనించలేదా అని అడిగాను. దానికి ఆమె ‘అవును కదా.. మంచి టీచర్‌ను కూడా చూపించారు. నాక్కూడా గుర్తు రాలేదు’ అని అన్నారు” అని శివ నిర్వాణ తెలిపారు. సినిమా చివర్లో కూడా ఆ మంచి టీచర్ పాత్ర ఉంటుందని, తాను చెప్పాలనుకున్న ఉద్దేశం స్పష్టంగా అర్థమయ్యేలా ఆ పాత్రను కూడా సినిమాలో ఉంచానని దర్శకుడు వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

