Shehnaaz Gill | సల్మాన్ సినిమా నుంచి ఔట్..షెహనాజ్ గిల్ క్లారిటీ
సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళి చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ (Shehnaaz Gill) ఈ సినిమాలో కీ రోల్లో కనిపించబోతున్నట్టు వార్తలు రావడంతో ఆమె ఫాలోవర్లు ఖుషీ అయ్యారు.
తెలుగుతోపాటు హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కభీ ఈద్ కభీ దివాళి (Kabhi Eid Kabhi Diwali). బాలీవుడ్ (Bollywood) యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కాగా సల్మాన్‌తో మంచి బాండింగ్ మెయింటైన్ చేసే బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ (Shehnaaz Gill) ఈ సినిమాలో కీ రోల్లో కనిపించబోతున్నట్టు వార్తలు రావడంతో ఆమె ఫాలోవర్లు ఖుషీ అయ్యారు.
అయితే లేటెస్ట్గా షెహనాజ్ ఫాలోవర్లను నిరాశపరిచే ఓ న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. షెహనాజ్‌ను సల్మాన్ ఖాన్ పక్కన పెట్టేశాడని..మరోవైపు షెహనాజ్ కూడా సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్‌ను అన్ ఫాలో చేసిందని వార్తలు రావడం చాలా మందిలో సందేహాలు రేకెత్తించాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ఓ పోస్ట్ పెట్టింది షెహనాజ్.
సల్మాన్ ఎంతగానో ప్రేమించే వ్యక్తి…సినిమాలో ఆయనతో రొమాన్స్ చేయడం ఎక్జయిటింగ్‌గా ఉందంటూ చెప్పుకొచ్చింది. సల్మాన్ ను ఆప్యాయంగా హగ్ చేసుకున్న స్టిల్‌తో షెహనాజ్ పోస్ట్ చేసిన ఈ స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఫర్హద్ సామ్జీ (Farhad Samji) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నట్టు టాక్. టాలీవుడ్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తుండగా..రాంచరణ్ అతిథి పాత్రలో మెరువబోతున్నాడు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

