Nisha Ravikrishnan | హీరోయిన్ పాత్రలే అక్కర్లేదు.. కాంతార వంటి సినిమాల్లో చిన్న పాత్ర ఇచ్చినా చాలు.. అమ్మాయిగారు ఫేమ్ నిషా
Nisha Ravikrishnan |రెండో తరగతిలోనే కెమెరా ముందుకు వచ్చింది. ఆరో తరగతికే ఒక షోకు హోస్ట్‌గా మారింది. కన్నడ అందం నిషా రవికృష్ణన్ జీవితం నిండా తళుకు బెళుకులే. తాజాగా, జీ తెలుగు ‘అమ్మాయిగారు’ పాత్రలో ఒదిగిపోయిన నిష ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
Nisha Ravikrishnan | రెండో తరగతిలోనే కెమెరా ముందుకు వచ్చింది. ఆరో తరగతికే ఒక షోకు హోస్ట్‌గా మారింది. కన్నడ అందం నిషా రవికృష్ణన్ జీవితం నిండా తళుకు బెళుకులే. తాజాగా, జీ తెలుగు ‘అమ్మాయిగారు’ పాత్రలో ఒదిగిపోయిన నిష ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
నేను పుట్టి పెరిగింది బెంగళూరులోనే. నాన్న రవికృష్ణన్ స్టేజ్ యాక్టర్. అమ్మ పేరు ఉష. కర్ణాటక సంగీతం, భరతనాట్యం అంటే తనకు ఇష్టం. చిన్నప్పటినుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనమని ప్రోత్సహించేది. రెండో తరగతిలో ఉండగానే.. సంగీత నాట్యాలలో నా సాధన మొదలైంది. క్రమంగా నాటకాలపై ఆసక్తి పెరిగింది. ఆరో తరగతిలో ఉండగానే ‘చింటు టీవీ’ అనే చానెల్లో ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా చేశాను. చదువు, కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటూ డిగ్రీ పూర్తి చేశాను. పదో తరగతిలో ‘సర్వమంగళ మాంగల్యే’ అనే కన్నడ సీరియల్లో మొదటి అవకాశం వచ్చింది. ‘గట్టిమేళ’తో నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నా. అప్పుడే జీ తెలుగు నుంచి పిలుపు వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. తెలుగు భాష కూడా తెలియదు. అయితేనేం, వచ్చిన కొన్ని రోజులకే ఈ వాతావరణంలో ఇమిడిపోయాను. తెలుగులో నేను నటించిన మొదటి సీరియల్ ‘ముత్యమంత ముద్దు’. సీరియల్ టీమ్ చాలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నా. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఎక్కడికి వెళ్లినా ‘అమ్మాయి గారు’, ‘అపురూప’ అంటూ సీరియల్ పేరు, పాత్రపేరు పెట్టి పిలుస్తారు.

కన్నడ సినిమాలు
అన్నట్టు, రెండు కన్నడ సినిమాల్లో నటిస్తున్నాను. రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టి వంటి నటులతో కలిసి నటించాలని కోరిక. హీరోయిన్ పాత్రలే కావాలని నిర్మాతలకు కండిషన్ పెట్టను. ‘కాంతార’ వంటి సినిమాల్లోప్రాధాన్యం ఉన్న చిన్న పాత్ర వచ్చినా చాలు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని ఉంది. హైదరాబాద్ నాన్-వెజ్‌ఫుడ్ అంటే ఇష్టం. నాకు బాగా ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ లండన్. త్వరలో అక్కడికి వెళ్తున్నా. అభిమానుల ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. నా పుట్టినరోజునూ సెలబ్రేట్ చేస్తుంటారు. ఒక అభిమాని ఏకంగా నా పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఓ ఆటోడ్రైవర్ బండి లోపల, బయట నా పోస్టర్లు వేయించాడు. పెద్దపెద్ద స్టార్స్ పక్కన నా హోర్డింగ్స్ చూసినప్పుడు ఇంతకన్నా ఏం కావాలి? అనిపిస్తుంది.
…? హరిణి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

