అరవైలో ఇరవైలా.. విరిసిన వరమాల..
ప్రేమ, రక్తబంధాల నేపథ్యంలో రూపొందిన కుటుంబకథా చిత్రం ‘షష్టిపూర్తి’. నాటి ‘లేడీస్టైలర్' జంట రాజేంద్రప్రసాద్, అర్చన ఇందులో కీలక పాత్రలు పోషించారు. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లు. పవన్‌ప్రభ దర్శకత్వంలో రూపేష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది.
ప్రేమ, రక్తబంధాల నేపథ్యంలో రూపొందిన కుటుంబకథా చిత్రం ‘షష్టిపూర్తి’. నాటి ‘లేడీస్టైలర్’ జంట రాజేంద్రప్రసాద్, అర్చన ఇందులో కీలక పాత్రలు పోషించారు. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లు. పవన్‌ప్రభ దర్శకత్వంలో రూపేష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ వేగవంతం చేశారు. ఇళయరాజా స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే కథానుగుణంగా ‘షష్టిపూర్తి’ రోజు వచ్చే గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘వేయి వేణువులనాదం మోగే హాయి హాయి హృదయాన.. ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన.. సరదాలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవైలో ఇరవైలా విరిసిన వరమాల..’ అంటూ సాగే ఈ పాటను చైతన్యప్రసాద్ రాయగా, కార్తీక్, విభావరి ఆప్టే జోషి కలిసి ఆలపించారు.
స్వర్ణ మాస్టర్ ఈ గీతానికి నృత్య రీతుల్ని సమకూర్చారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు హైలైట్ కానున్నదని, ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందేనని, ఈ పాటకోసం లెజెండ్రీ కళాదర్శకుడు తోటతరణి నిర్మించిన మండువ లోగిలి సెట్ అద్భుతమైన అనుభూతికి లోను చేస్తుందని, రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్‌లపై చిత్రీకరించిన ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానున్నదని మేకర్స్ తెలిపారు. ‘కాంతార’ఫేం అచ్యుత్‌కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, మురళీధర్‌గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రామ్, నిర్మాణం: మా ఆయి ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

