Sharwanand Biker | టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ (Biker) ఓటీటీలోకి రాబోతుంది. భారతదేశంలోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ చిత్రం మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. ఇక హిందీలో ఈ సినిమాను ‘శర్వా’ (Sharwa) అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించారు. ఒక ప్రొఫెషనల్ బైక్ రేసర్ తన కెరీర్లో ఎదుర్కొనే సవాళ్లు, తండ్రి ఆశయాల కోసం అతను చేసే పోరాటాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, రేసింగ్ సీక్వెన్స్ మరియు టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి.
#Biker 🏍️(Telugu) Streaming from Tonight on Netflix in Telugu, Tamil, Kannada & Malayalam 🍿!!
In Hindi also Titled as #Sharwa !!#OTT_Trackers pic.twitter.com/H4jJCYBomQ
— OTT Trackers (@OTT_Trackers) April 30, 2026