పారాచూట్ పనిచేయలేదు!
‘జాను’ షూటింగ్ సమయంలో స్కైడైవింగ్ ఫెయిల్ కావడం వల్ల తాను తీవ్రమైన ప్రమాదానికి గురయ్యానని, కోలుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందని చెప్పారు హీరో శర్వానంద్.
‘జాను’ షూటింగ్ సమయంలో స్కైడైవింగ్ ఫెయిల్ కావడం వల్ల తాను తీవ్రమైన ప్రమాదానికి గురయ్యానని, కోలుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందని చెప్పారు హీరో శర్వానంద్. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొన్న ఆయన నాటి ప్రమాదాన్ని గుర్తుతెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు. “జాను’ సినిమాలో ‘లైఫ్ ఆఫ్ రామ్’ పాట షూటింగ్ కోసం స్కై డైవింగ్ చేయాల్సి వచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నా. దాదాపు 15000 అడుగుల ఎత్తులో ఫ్లైట్ నుంచి దూకాలి. నా దురదృష్టం కొద్ది కిందకు ల్యాండ్ అవుతున్న సమయంలో పారాచూట్ సరిగ్గా పనిచేయలేదు. దాంతో బలంగా కింద పడ్డాను. కుడి భుజానికి, కాలికి గాయాలయ్యాయి.
సర్జరీ చేసి ప్లేట్స్ వేశారు. ఆ ప్రమాదం నుంచి సాధారణ జీవితంలోకి రావడానికి నాకు రెండున్నరేళ్ల సమయం పట్టింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో త్వరగా కోలుకోగలిగా. ఆ భయానక సంఘటనను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని శర్వానంద్ చెప్పారు. ఆయన నటించిన ‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబర్‌లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విజయాన్ని సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- baala krishna
- Jaanu
- Sharwanand
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

