‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు శర్వానంద్. ఇప్పుడాయన ‘బైకర్’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మోటార్ సైకిల్ రేసింగ్ నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు శర్వానంద్.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో శర్వానంద్ బైకర్ లుక్లో పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ‘1990, 2000 బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. ‘మూడు తరాల బైక్ రేసింగ్ కలల్ని, కుటుంబ అనుబంధాలను ఆవిష్కరిస్తూ సాగే ఎమోషనల్ డ్రామా ఇది.
క్రీడా నేపథ్యం తాలూకు స్ఫూర్తి, కుటుంబ బంధాల తాలూకు ఆర్థ్రతను ఆవిష్కరిస్తూ హృదయాల్ని కదిలిస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్, రచన-దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర.