Sharan kumar: సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి మరో హీరో..!

సినిమా ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ అప్పట్లో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుశాంత్ మరణించిన సమయంతో దీనిపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. నెపోటిజం బాగా ఉందంటూ దుమ్మెత్తిపోసారు. అయినప్పటికీ స్టార్ ఫ్యామిలీల నుండి వారసుల పరిచయం ఎక్కడా తగ్గట్లేదు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి స్టార్ కుటుంబాల నుంచి ఇప్పటికే చాలామంది హీరోలుగా పరిచయం అయ్యారు. సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మహేష్ బాబు, సీనియర్ నరేష్, రమేష్ బాబు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అతనే శరణ్ కుమార్.శివ కేశర కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ఎం.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాతో ఆయన వెండితెరకు పరిచయం కానున్నారు.
శనివారం శరణ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండిఫస్ట్ గ్లింప్స్‌ని కృష్ణ విడుదల చేశారు. ఇది సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా శరణ్‌కు మంచి బ్రేక్ ఇస్తుంది అని ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత సుధాకర్ రెడ్డి అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

