Shanmukh Wedding | బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. గత కొంతకాలంగా తన ప్రేమ జీవితం గురించి పలు ఊహాగానాలు వినిపిస్తుండగా, ఇటీవల తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకుని ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.ఇక తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి పీటలెక్కాడు.ఎలాంటి హడావిడి లేకుండా రాజమండ్రికి చెందిన వైష్ణవితో ఏడుడగులు వేయగా, వారి పెళ్లికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పెళ్లి ఫొటోల్లో షణ్ముఖ్, వైష్ణవి ఎంతో ఆనందంగా కనిపించారు. ఈ జంటను చూసిన అభిమానులు “మేడ్ ఫర్ ఈచ్ అదర్”, “క్యూట్ కపుల్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైష్ణవి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ జశ్వంత్ ఆ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. యూట్యూబ్‌లో అప్పటికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతను టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా, చివరకు రన్నరప్‌గా నిలిచాడు.
అయితే బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని పరిణామాలు అతని వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా సిరి హనుమంత్‌తో అతని స్నేహం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. బిగ్‌బాస్‌కు వెళ్లే సమయానికి షణ్ముఖ్ యూట్యూబర్ దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. అయితే షో ముగిసిన తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ బ్రేకప్ అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.దీని తర్వాత షణ్ముఖ్ పలు వివాదాల కారణంగా వార్తల్లో నిలిచినా, ప్రస్తుతం మళ్లీ తన కెరీర్‌పై దృష్టి సారించాడు. ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్‌లు, డిజిటల్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న షణ్ముఖ్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. వైష్ణవిని పెళ్లి చేసుకొని ఎట్టకేలకి బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పాడు.