Shalini Pandey | అర్జున్ రెడ్డి భామ చూపుల వలలో చిక్కేదెవరో?
Shalini Pandey | ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ‘ప్రీతి’గా సుపరిచితురాలు షాలినీ పాండే. ఈ ఉత్తరాది బ్యూటీ తన తొలిచిత్రంతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. తనదైన నటనా పాటవాన్నీ ప్రదర్శించిది. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లో కొన్నిప్రత్యేక పాత్రలు పోషించింది.
Shalini Pandey | ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ‘ప్రీతి’గా సుపరిచితురాలు షాలినీ పాండే. ఈ ఉత్తరాది బ్యూటీ తన తొలిచిత్రంతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. తనదైన నటనా పాటవాన్నీ ప్రదర్శించిది. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లో కొన్నిప్రత్యేక పాత్రలు పోషించింది. ‘100% లవ్’కి రీమేక్‌గా వచ్చిన ‘100% కాదల్’తో ఈ అమ్మడు తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘118’లో కళ్యాణ్‌రామ్‌తో, ‘ఇద్దరిలోకం ఒకటే’లో రాజ్ తరుణ్‌తో రొమాన్స్ చేసినప్పటికీ ఎప్పుడూ టాప్ లీగ్‌లోకి రాలేకపోయింది. ‘గొరిల్లా’, ‘సైలెన్స్’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఆమెకు తమిళంలోనూ అదే పరిస్థితి ఎదురైంది. రణ్‌వీర్‌సింగ్ హీరోగా హిందీలో ‘జయేష్ భాయ్ జోర్దార్’తో తన కెరీర్ టేకాఫ్ అవుతుందని ఆమె అంచనా వేసింది.
యష్ రాజ్ ఫిల్మ్ నిర్మించిన ఈ సినిమా డిజాస్టర్‌గా మారి ఈ సొగసరి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ప్రస్తుతం షాలిని చేతిలో ‘మహారాజా’ తప్ప సినిమాలేవీ లేవు. అయితే ఈ జబల్పూర్ జాణ తన గ్లామర్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ‘అర్జున్‌రెడ్డి’ రోజులతో పోల్చితే చాలా స్లిమ్‌గా మారింది ఈ అమ్మడు. ట్రెండీ దుస్తుల్లో తన స్లిమ్ బాడీని ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడటంలేదు. తన ఫొటోషూట్స్ అందరికీ పంచుతూ అభిమానుల్లో వేడిని పుట్టిస్తోంది. ఇటీవల ఓ స్విమ్మింగ్ ఫూల్ క్లిక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఒంపుసొంపులన్నీ ఆరబోస్తూ ముద్దుగా ముఖం పెట్టిన ఈ భామ చూపుల వలలో దర్శక నిర్మాతలు చిక్కుతారా?.. అవకాశాలు ఇస్తారా వేచిచూడాలి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

