Shalini Pandey | అర్జున్ రెడ్డి టీంకు షాలినీ పాండే ఎమోషనల్ నోట్
షాలినీ పాండే (Shalini Pandey) తొలి ప్రయత్నంలోనే మంచి బ్రేక్ అందుకున్న ప్రాజెక్టు అర్జున్ రెడ్డి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హద్దులను చెరిపేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది.
అర్జున్ రెడ్డి (Arjun Reddy) ..విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన చిత్రం. జబల్ పూర్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey) తొలి ప్రయత్నంలోనే మంచి బ్రేక్ అందుకున్న ప్రాజెక్టు. దక్షిణాదితోపాటు ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద కూడా అర్జున్ మేనియా కొనసాగింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హద్దులను చెరిపేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా విజయవంతంగా ఐదేళ్లు (Arjun Reddy @ 5 years) పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టింది షాలినీ పాండే. తన తొలి చిత్రానికి ఎంతో సపోర్టు చేసిన కోస్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ధన్యవాదాలు తెలియజేసింది. ‘ఆగస్టు 25..ఈ డేట్‌కు నా జీవితంలో ముఖ్యమైన స్థానం ఉంది. ఐదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా అర్జున్ రెడ్డి విడుదలైంది. ఈ సినిమా నా మరపురాని క్షణాల్లో ఒకటిగా నిలిచింది. అర్జున్ రెడ్డిలో ప్రీతి పాత్రపై నాకు లభించిన ప్రేమ, ప్రశంసలు అపూర్వమైనవి. అందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అర్జున్ రెడ్డికి నేను రుణపడి ఉంటాను..’అంటూ పోస్ట్ పెట్టింది షాలినీ పాండే.
ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఏడాది రన్వీర్ సింగ్‌తో కలిసి జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది షాలినీ పాండే. ప్రస్తుతం మహారాజ సినిమాలో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

