Dunki Movie | పఠాన్ (Pathaan), ‘జవాన్’ (Jawan) సినిమాలతో ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). ఈ రెండు చిత్రాలు 2023లో వచ్చి రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. అయితే షారుఖ్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’ (DUNKI). త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK) వంటి బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ (Tapsee) కథనాయికగా నటిస్తుంది. ఈ సినిమా ప్రభాస్ సలార్‌కు పోటిగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్లు ఇస్తూ.. ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డంకీ’ డ్రాప్ 1, డ్రాప్ 2, డ్రాప్ 3, డ్రాప్ 4లు అంటూ అప్డేట్స్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌తో పాటు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ‘డంకీ’ డ్రాప్ 5 అంటూ ‘ఓ మాహీ..’ అనే ప్రమోషనల్ వీడియో పాటను విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడీగా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ఇక డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.