Shahid Kapoor: కరీనాతో ముద్దు వీడియో.. 18 ఏండ్ల తర్వాత స్పందించిన షాహిద్
Shahid Kapoor | బాలీవుడ్ హీరోలలో షాహిద్ కపూర్‌కి ఒక సెపరేట్ స్టార్డమ్ ఉంది. అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాను కబీర్ సింగ్ (Kabhir Singh)గా రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన షాహిద్.. ఫర్జీ(Farzi), బ్లడీ డాడి(Bloody Dady) వంటి సిరీస్‌లతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.
Shahid Kapoor | బాలీవుడ్ హీరోలలో షాహిద్ కపూర్‌కి ఒక సెపరేట్ స్టార్డమ్ ఉంది. అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాను కబీర్ సింగ్ (Kabhir Singh)గా రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన షాహిద్.. ఫర్జీ(Farzi), బ్లడీ డాడి(Bloody Dady) వంటి సిరీస్‌లతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఒకప్పుడు షాహిద్ కపూర్, బాలీవుడ్ నటి కరీనా కపూర్(Kareena Kapoor) ప్రేమలో మునిగి తేలిన విషయం తెలిసిందే. జబ్ వి మెట్ (Jab we met) సినిమా టైంలో వీరిద్దరూ చాలా డీప్ లవ్‌లో ఉండగా.. అదే టైంలో షాహిద్ కరీనా ముద్దు పెట్టుకుంటూ ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఫొటోలు, వీడియో లీక్ కావడంతో షాహిద్, కరీనా మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీక్ కావడంపై 18 ఏండ్ల తర్వాత షాహిద్ కపూర్ తొలిసారి స్పందించాడు. ఆ వీడియోని ఓ వ్యక్తి కేవలం రూ.500 కోసం లీక్ చేశాడు. ఈ సంఘటన జరిగినప్పుడు నా వయసు 24 ఏండ్లు. ఫోటోలు, వీడియో లీక్ కావడంతో నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ముగిసిపొయింది (destroyed) అనుకున్నాను. ఆ పరిస్థితులు నన్నెంతో బాధించాయి. అనంతరం మెల్లిగా కోలుకోగలిగాను. ఇప్పుడు నాకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్నారు, ఇప్పుడు నా పర్సనల్ లైఫ్‌ను ఎవరూ పట్టించుకోరు’ అని షాహిద్ కపూర్ ఒ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం షాహిద్ రెండు సినిమాలను సెట్స్ మీదుంచాడు. అందులో జియో స్టూడియోస్ (Jio Studios) బ్యానర్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ఒకటి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కృతిసనన్ (kriti Sanon) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను అమిత్ జోషి (Amit Joshi) దర్శకత్వం వహిస్తున్నాడు. మాడోక్ ఫిల్మ్స్, జియో స్టూడీయోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

