నటన కంటే దర్శకత్వం, కథా రచన చేయడం తన దృష్టిలో గొప్ప సృజనాత్మక ప్రక్రియలు అని చెప్పారు బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్‌కపూర్. కెమెరా ముందు ఎంతటి సవాలుకైనా సిద్ధపడతానని.. కథా రచన వంటి క్రియేటివ్ అంశాల జోలికి అస్సలు వెళ్లనని తెలిపారు. ‘కబీర్‌సింగ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న షాహిద్‌కపూర్ ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రంలో
నటిస్తున్నారు. ఈ నెలలోనే విడుదలకానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. నటన తప్ప తనకు మరో వ్యాపకం లేదని..డైరెక్షన్, రైటింగ్ గురించి ఏ రోజూ ఆలోచించలేదని అన్నారు. ‘కథా రచన, సినిమాకు దర్శకత్వానికి చాలా మేథస్సు అవసరం. నా దృష్టిలో దర్శకరచయితలే అసలైన సృజనకారులు. వారికి నా హృదయంలో
ఎల్లప్పుడు ప్రత్యేకస్థానం ఉంటుంది’ అని షాహిద్‌కపూర్ చెప్పారు.