బాలీవుడ్లో కరోనా విస్పోటనం.. షారుఖ్ ఖాన్, కత్రినాకు కరోనా పాజిటివ్
ముంబై : మొన్నటి వరకు శాంతించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్ మారినపడగా.. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో పాటు ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ సైతం వైరస్ బారినపడ్డారు. అలాగే ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్‌తో పాటు పలువురు నటులకు వైరస్ సోకింది. దీంతో బాలీవుడ్లో మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. గతనెల బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ 50వ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన బర్త్ డే పార్టీకి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా తరలివచ్చారు. పెళ్లిళ్లు అయిన వాళ్లు, భార్యభర్తలతో, పెళ్లికాని వారు బాయ్‌ఫ్రెండ్స్, కోస్టార్స్‌తో కలిసి పార్టీకి హాజరయ్యారు. తాజాగా ఆ పార్టీకి వచ్చిన వారంతా వైరస్ బారినపడుతున్నట్లు తెలుస్తున్నది. పార్టీకి వచ్చిన వారిలో 55 మందికి వైరస్ సోకినట్లు తెలుస్తుండగా.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ పృథ్వీరాజ్ చౌహాన్ మాట్లాడుతూ కత్రినా కైఫ్‌కు జూన్ 1న, కార్తీక్ ఆర్యన్‌కు జూన్ 4న కరోనా పాజిటివ్‌గా వచ్చిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పార్టీకి బాలీవుడ్ స్టార్, యంగ్ హీరోలు హాజరయ్యారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, కాజల్, మాధురి దీక్షిత్, జూహీ చావ్లా, రవీనా టండన్, జాన్వీ కపూర్, రణ్వీర్ సింగ్, దీపికా, కత్రినా, కియారా, కృతి సనన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్‌తో పాటు పలువురు పార్టీకి హాజరయ్యారు. తాజాగా ఇప్పటికే పలువురు స్టార్స్ వైరస్ బారినపడడంతో బాలీవుడ్లో కలకలం సృష్టిస్తున్నది. అయితే, కార్తీక్ ఆర్యన్ పార్టీకి హాజరుకాలేదని, అతనితో కలిసి నటించిన నటీనటుల నుంచి వైరస్ సోకినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తాజాగా భూల్ భులయ్య 2 హీరోగా నటించిన విషయం తెలిసిందే.
అయితే, కొవిడ్ పాజిటివ్‌గా తేలిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సబ్ కుచ్ ఇత్నా పాజిటివ్ చల్ రహా థా, కోవిడ్ సే రహా నహీ గయా’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం కత్రినా కైఫ్.. విజయ్ సేతుపతితో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రంలో నటిస్తున్నది. ఈ క్రమంలో కొవిడ్ బారినపడడంతో చిత్రం షూటింగ్‌ను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. అలాగే కత్రినా తన భర్త విక్కీ కౌశల్‌కు ఉత్తమ అవార్డు రాగా.. ఐఫా అవార్డులకు వేడుకకు హాజరుకాలేకపోయింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

