‘పఠాన్’ అసలు కలెక్షన్ ఎంతన్న నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన షారూఖ్ ఖాన్
Shah Rukh Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇవాళ ఓ సోషల్ మీడియా యూజర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. 'పఠాన్' అసలు కలెక్షన్ ఎంతని ఓ ట్విటర్ యూజర్ ఆరాతీయగా.. బాలీవుడ్ బాద్షా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇవాళ ఓ సోషల్ మీడియా యూజర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. ఇటీవల విడుదలైన షారూఖ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పఠాన్’ అసలు కలెక్షన్ ఎంతని ఓ ట్విటర్ యూజర్ ఆరాతీయగా.. బాలీవుడ్ బాద్షా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అభిమానులతో నేరుగా టచ్‌లో ఉండేందుకు షారూఖ్ ఖాన్ ట్విటర్లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరుతో ఒక సెషన్ నిర్వహిస్తున్నాడు.
ఆ సెషన్లో భాగంగానే ఒక ట్విటర్ యూజర్ పఠాన్ సినిమా అసలు కలెక్షన్ ఎంతని ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇలాంటి ప్రశ్నలకు చమత్కారంగా, ఉల్లాసంగా సమాధానం ఇవ్వడంలో ఆరితేరిన షారూఖ్ ఈ ప్రశ్నకు కూడా తనదైన శైలిలో.. ‘5 వేల కోట్ల మంది ప్రేమ. 3 వేల కోట్ల మంది ప్రశంసలు. 3,250 కోట్ల మంది కౌగిలింతలు… రెండు బిలియన్ల (సుమారు 16 వేల కోట్లు) మంది నవ్వులు, ఇంకా లెక్కింపు కొనసాగుతున్నది’ అని జవాబిచ్చాడు. చివరలో ‘నీ అకౌంటెంట్ నీకు ఏం చెప్పాడు..??’ అంటూ చమత్కరించాడు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, యశ్‌రాజ్ ఫిల్మ్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న పఠాన్ సినిమా జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాకు షారూఖ్ అభిమానుల నుంచి, సాధారణ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌గా మారింది. తొలిరోజే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తొలి 8 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల మొత్తం రూ.364 కోట్లను దాటింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

