Dunki Trailer | షారుఖ్ ‘డంకీ’ నుంచి బిగ్ అప్డేట్ – ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.?
Dunki Movie Trailer |ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' సినిమాలతో తిరుగులేని విజయాన్నందుకున్న షారుఖ్ ప్రస్తుతం అదే జోష్‌తో చేస్తున్న చిత్రం 'డంకీ' (Dunki). త్రీ ఇడియట్స్ (3 Idiots), ‘పీకే'(PK), ‘సంజు (Sanju) లాంటి బ్లక్ బస్టర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణీ (Raj Kumar Hirani) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Dunki Movie Trailer |ఈ ఏడాది ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో తిరుగులేని విజయాన్నందుకున్న షారుఖ్ ప్రస్తుతం అదే జోష్‌తో చేస్తున్న చిత్రం ‘డంకీ’ (Dunki). త్రీ ఇడియట్స్ (3 Idiots), ‘పీకే'(PK), ‘సంజు (Sanju) లాంటి బ్లక్ బస్టర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణీ (Raj Kumar Hirani) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ పన్ను (Tapsee Pannu) నటిస్తుంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన డంకీ డ్రాప్ 1, డ్రాప్ 2 లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 07న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుండగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ నేడు రాత్రి 7 గంటలకు విడుదల కానుంది.
ఇక డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్(Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

