బాలీవుడ్లో ఈ ఏడాది భారీగా అచ్చొచ్చిన నటుడు ఎవరని అడిగితే షారుక్ ఖాన్ పేరే వినిపిస్తుంది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కింగ్ ఖాన్ 2023లో హ్యాట్రిక్ విక్టరీ సొంతం చేసుకున్నాడు. ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. తాజాగా విడుదలైన ‘డంకీ’ కూడా సూపర్ హిట్ కావడంతో షారుఖ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 25న విడుదలైన ‘పఠాన్’ వరల్డ్ వైడ్‌గా సుమారు రూ.1,065 కోట్లు రాబట్టింది.
సెప్టెంబర్ 7న విడుదలైన ‘జవాన్’ సినిమా ‘పఠాన్’ను మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,150 కోట్లు వసూలు చేసింది. ఈ నెల విడుదలైన ‘డంకీ’ కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని షారుఖ్‌కు హ్యాట్రిక్ విక్టరీని కట్టబెట్టింది. ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని సినీపండితుల విశ్లేషణ. ‘సలార్’ సినిమా విడుదలతో ‘డంకీ’ కలెక్షన్లు కొంత తగ్గినా.. వెయ్యి కోట్లు గ్యారెంటీ అని చెబుతున్నారు.