బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాతో నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు జగపతిబాబు. అప్పటివరకూ హీరోగా నటించిన ఆయన, ఆ సినిమా నుంచి విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, ప్రస్తుతం టాలీవుడ్‌కి మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారారు. నటుడు శ్రీకాంత్ విలన్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది కూడా బాలకృష ్ణ‘అఖండ’ సినిమాతోనే. ఈ వరుసలోనే త్వరలో హీరో రాజశేఖర్ కూడా బాలయ్య సినిమాతో విలన్‌గా న్యూ జర్నీని మొదలుపెట్టనున్నట్టు సమాచారం.
బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మాఫియా నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అందుకే ఈ పాత్ర కోసం ఇటీవల డా.రాజశేఖర్‌ని కొరటాల శివ కలిశారట. అదే నిజమైతే కేవలం అభిమానులకే కాదు, సగటు సినీ అభిమానికి సైతం ఇది శుభవార్తే.