విద్యా వ్యవస్థ నేపథ్యంలో స్నేహ చిత్ర పతాకంపై ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘యూనివర్సిటీ’. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ…‘మా యూనివర్సిటీ సినిమాకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించి, సినిమా రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు అందించాలని చెబుతూ ఈ చిత్రాన్ని రూపొందించాను. విద్యార్థులతో పాటు నేటి యువతను ఆకట్టుకునే చిత్రమవుతుంది’ అన్నారు.