Sekhar Kammula | ఉమెన్స్ కాలేజీ ఫెస్ట్‌లో శేఖర్‌కమ్ముల..రీమిక్స్ పాటలతో సందడి
హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఫర్ ఉమెన్ (St Francis College for Women) లో క్యాంపస్ ఫెస్ట్ ‘Yuvaflare’ను ఇవాళ ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల (Sekhar Kammula) ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఫర్ ఉమెన్ (St Francis College for Women) లో ఇంటర్నేషనల్ వర్చువల్ క్యాంపస్ ఫెస్ట్ ‘Yuvaflare’ను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి 23 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల (Sekhar Kammula) ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల సినిమాల నుంచి రామ సక్కని సీత, వచ్చే వచ్చే, తప్పులు టిప్పులు, వచ్చిందే, సారంగ దరియా రీమిక్స్ పాటకు విద్యార్థినిలు డ్యాన్స్ చేసి అదరగొట్టారు.
అనంతరం విద్యార్థినులు శేఖర్‌కమ్ములతో ఫొటోలు దిగారు. సెల్పీలు తీసుకున్నారు. శేఖర్ కమ్ముల తన సినిమాల్లో హీరోయిన్లకు చాలా ప్రాధాన్యతనిస్తుంటారని తెలిసిందే. నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ ఫెస్ట్‌లో ‘బిజ్మున్’ వంటి సాహిత్య వ్యాపార కార్యక్రమం, ‘ఉండాలా వద్దా’ లాంటి సృజనాత్మక కార్యక్రమం, ‘సంస్కృతి ఎక్స్‌ప్రెస్’ టాలెంట్ ఈవెంట్, ‘యువెకోఫ్రీక్’ వంటి పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

SFC YouTube ఛానెల్ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఫెస్ట్ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న విద్యార్థినులకు ప్రిన్సిపాల్ డాక్టర్ సాండ్రా హోర్త శుభాకాంక్షలు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం



