Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Scene | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘సీన్’ దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలో విడుదలైంది.
Scene | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘సీన్’ దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలో విడుదలైంది. ‘ఆవేశం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జిత్తు మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత సూర్య పోలీస్ అధికారిగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై అభిమానులు ఆరా తీస్తున్నారు.
‘సీన్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఇదే విధానాన్ని అనుసరిస్తే ‘సీన్’ సినిమా డిసెంబర్లో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారం లేదా మూడో వారంలో స్ట్రీమింగ్ కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఓటీటీ విడుదల తేదీపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. థియేటర్లలో సినిమా ప్రదర్శన, ప్రేక్షకుల స్పందనను బట్టి విడుదల తేదీలో మార్పులు ఉండవచ్చు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటించారు. వీరిద్దరి కలయిక సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచింది. అంతేకాకుండా నస్లేన్, లాల్, ఆనందరాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సుశిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
2డీ ఎంటర్టైన్మెంట్స్, జగరమ్ స్టూడియోస్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. యాక్షన్‌తో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంశాలను మేళవించి దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. సీన్ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో సూర్య ఇన్బరాజ్ అనే పోలీస్ అధికారిగా కనిపించారు. పోలీస్ శాఖలో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్న ఇన్బరాజ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అయితే గతంలో ఆయన పరిష్కరించకుండా వదిలేసిన ఒక కేసు మరోసారి తెరపైకి వస్తుంది. దీంతో ఆ కేసును ఎలాగైనా పరిష్కరించాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది.ఈ నేపథ్యంలో ఇన్బరాజ్ మరోసారి కేసు దర్యాప్తులోకి దిగాల్సి వస్తుంది. అయితే ఈసారి ఆయనకు ఎదురయ్యే పరిస్థితులు అంత సులభంగా ఉండవు. సమస్యాత్మకమైన, గందరగోళమైన ఓ పోలీస్ బృందంతో కలిసి దర్యాప్తు కొనసాగించాల్సి వస్తుంది. గతంలో పరిష్కారం కాని ఆ కేసు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? పాత కేసుకు, ఇప్పుడు ఎదురైన పరిణామాలకు ఉన్న సంబంధం ఏంటి? మంచి పేరున్న సిన్సియర్ పోలీస్ అధికారి ఇన్బరాజ్ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశాడు? చివరకు ఈ కేసును ఎలా పరిష్కరించాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- movie review
- netflix
- ott
- scene
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

