వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 వచ్చేస్తున్నది. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నదని, దాన్ని మించేలా ఈ రెండో సీజన్ ఉంటుదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ సీరీస్ సృష్టికర్తలు. అరుణ్ కొత్తపల్లి దర్శకుడు.
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, పావని, సోర్దార్ సుజాత ప్రధానపాత్రధారులు. ఈ సిరీస్ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో వైవాహిక జీవితంలో విసిగిపోయిన భర్తలుగా ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ మరోసారి తమ ఫ్రస్టేషన్‌తో నవ్వించారు. భార్యలు కూడా భర్తలకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. మిస్సింగ్ మిస్టరీ నేపథ్యంతో కూడిన కథ అని ట్రైలర్ చెబుతున్నది. శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యల్దండి, సీతర్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్షవర్దన్ ఇందులో ఇతర పాత్రధారులు.