Satyadev | ‘సీజన్ ఆఫ్ మ్యాజిక్’ అంటున్న సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్
Gurthundha seethakalm trailer | నటనా ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ విలక్షన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్.
Gurthundha seethakalm trailer | నటనా ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ విలక్షన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్‌గా సినీరంగంలో దూసుకుపోతున్నాడు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నాగ శేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైనమెంట్స్ పతాకాలపై నాగ శేఖర్, భావన రవి, రామారావ్ చింతపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ కు జోడిగా తమన్నా, మేఘా ఆకాశ్, కావ్యశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘శీతాకాలం.. మంచులో మనుషులు తడిసి ముద్దయ్యే కాలం. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం. నా లైఫ్‌లో శీతాకాలంకు ఇంకో పేరుంది. సీజన్ ఆఫ్ మ్యాజిక్ అంటూ ట్రైలర్ మొదలయింది. మనసుతో ప్రేమించాలంటే ముందు కళ్ళతో చూడాలి కదా. అలా నా కళ్ళకు ఏ అమ్మాయి నచ్చినా వెంటనే తనే నా లైఫ్ పార్ట్నర్ అనిపిస్తుంది. స్కూల్ డేస్‌లో కోమలి.. కాలేజ్ డేస్‌లో అమ్ము.. జర్నీలో దివ్య.. ఫైనల్‌గా నిధి.. అంటూ సత్యదేవ్ తన ప్రేమ కథలు చెప్పడం అలరిస్తున్నాయి. ఇలా శీతాకాలం వచ్చిన ప్రతిసారి కొత్త కొత్త అందాలను మోసుకొచ్చి నా ఊపిరాడకుండా చేసింది. వీళ్లలో నా లైఫ్ పార్ట్నర్ ఎవరనే ప్రశ్నకు సమాదానం గురించి ఆలోచిస్తుంటే గాలిలో మెల్లగా చల్లగా వినిపిస్తుంది గుర్తుందా శీతాకాలం’ అంటూ సినిమాలో సత్యదేవ్ ప్రతి శీతాకాలంలో ప్రేమలో పడటం.. అలా తన ప్రేమ కథలను చెప్పడం వంటివి ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

