సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘దుర్గమ్మ..’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. కాలభైరవ సంగీతాన్నందించిన ఈ పాటను అనంత్‌శ్రీరామ్ రచించారు. నవరాత్రుల సందర్భంలో దుర్గమ్మ సన్నిధిలో హీరో సంతోషంగా ఆడిపాడే సందర్భంలో ఈ పాటను తెరకెక్కించారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ ఈ కథలో స్నేహానికి ఉన్న విలువను చూపిస్తున్నాం. రియలిస్టిక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. అతీరారాజ్, లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: కాలభైరవ, సమర్పణ: కొరటాల శివ, నిర్మాణ సంస్థ: అరుణాచల క్రియేషన్స్, దర్శకత్వం: వి.వి.గోపాలకృష్ణ.