‘సమస్యలు అంటూ లేని ఒక బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి నిశ్చితార్థం జరిగిన తరువాత జీవితంలో ఎదురైన సమస్యలేంటి? ఆ ప్రాబ్లమ్స్‌ను ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నాను’ అనేది ‘నీతో’ సినిమాలో నా పాత్ర. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు సాత్వికారాజ్.
ఆమె నాయికగా నటించిన ‘నీతో’ చిత్రం రేపు విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ లవ్‌స్టోరి కాదు. వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలతో చూస్తే చాలా వినూత్నంగా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందరి నచ్చుతుందని, నాయికగా నాకు మంచి పేరును తీసుకొస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పింది.