గ్రామీణ ప్రేమకథ
రక్షిత్ అట్లూరి, కోమలి జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి నిర్మించారు.
రక్షిత్ అట్లూరి, కోమలి జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అంటూ పోస్టర్ మీద వేసిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.
‘గ్రామీణ నేపథ్యంలో నడిచే హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. పోస్టర్ మీద వేసిన డైలాగ్ సినిమా సారాంశాన్ని మొత్తం తెలియజేస్తుంది. మెలోడీ ప్రధానమైన పాటలతో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీసాయికుమార్ దారా, సంగీతం: శరవణ వాసుదేవన్, రచన-దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

