సీనియర్ దర్శకుడు, నిర్మాత రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆర్కే టెలీ ఫిలింస్ నిర్మిస్తున్న ‘సర్కారు నౌకరి’ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.
గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భావనా వళపండల్ హీరోయిన్గా నటిస్తోంది. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకే ఆర్కే టెలీ ఫిలింస్ స్టార్ట్ చేశాను’ అన్నారు. గాయని సునీత మాట్లాడుతూ “మీ అబ్బాయి మంచి నటుడితో పాటు మంచి నడవడిక వున్న యువకుడు. తప్పకుండా అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది’ అంటూ రాఘవేంద్రరావు చెప్పడం నా లైఫ్‌లో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది’ అన్నారు.