గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకుడు. ఆర్.కె.టెలీషో పతాకంపై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు.
‘ఒక్కడి ఆలోచనతోనే విప్లవం మొదలవుతుంది’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉంది. సామాజిక సందేశం కలబోసిన కథాంశమిదని చిత్రబృందం పేర్కొంది. భావనా వళపండల్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్.