Cinema News | ఇంద్రగంటి మోహనకృష్ణ చేతిలో సారంగపాణి జాతకం..
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో ఇదివరకే జెంటిల్మెన్, సమ్మోహనం వంటి ఎంటర్టైనర్స్ వచ్చాయి.
Cinema News | శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో ఇదివరకే జెంటిల్మెన్, సమ్మోహనం వంటి ఎంటర్టైనర్స్ వచ్చాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ప్రియదర్శి కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఆదివారం ఈ టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతని చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే పరిపూర్ణ హాస్యరసచిత్రమిది. ఇంద్రగంటి అద్భుతమైన కథ రాసుకున్నారు. సాంకేతికంగా సినిమా ఉన్నతస్థాయిలో ఉంటుంది. 90శాతం చిత్రీకరణ పూర్తయింది. నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగే షూటింగ్లో రెండు పాటలు, మిగతా సన్నివేశాలు చిత్రీకరిస్తాం.
దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది.’ అని శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ‘నమ్మకం మనిషికి బలాన్నిస్తుంది. మూఢనమ్మకం బుద్ధిహీనుడ్ని చేస్తుంది. అలా నవ్వులపాలైన ఓ మధ్యతరగతి మంచి అబ్బాయి కథే మా ‘సారంగపాణి జాతకం’. వినోదంతోపాటు భావోద్వేగాలను కూడా ప్రియదర్శి చక్కగా పండించాడు. కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా ఇది’ అని పేర్కొన్నారు. రూప కొడువాయూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేశ్, తనికెళ్లభరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

