కమెడియన్ సప్తగిరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గూడుపుఠాణి’. నేహా సోలంకి నాయిక. కుమార్ కేఎమ్ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను సీనియర్ నటుడు కృష్ణ ఇటీవల విడుదల చేశారు. ఆడియన్స్ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే పలు అంశాలు ఈ చిత్రంలో వున్నాయని, కృష్ణ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ విడుదల కావడం ఆనందంగా వుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ప్రతాప్ విద్య.