Sapta sagaralu Daati (Side B) | గెట్ రెడీ ఫోక్స్.. ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ ట్రైలర్ వచ్చేస్తుంది.!
Sapta sagaralu Daati (Side B) | ఈ మధ్య కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ' (Sapta Sagaradaache Ello). కేజీఎఫ్, కాంతార, చార్లీ777 వంటి సినిమాల తర్వాత తెలుగు జనాలను అంతలా ఇంపాక్ట్ చేసింది ఈ సినిమానే. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి (Rukmini) కథానాయికగా నటిచింది.
Sapta sagaralu Daati (Side B) | ఈ మధ్య కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ’ (Sapta Sagaradaache Ello). కేజీఎఫ్, కాంతార, చార్లీ777 వంటి సినిమాల తర్వాత తెలుగు జనాలను అంతలా ఇంపాక్ట్ చేసింది ఈ సినిమానే. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి (Rukmini) కథానాయికగా నటిచింది.హేమంత్ రాజ్ (Hemanth Raj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 01న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను సప్త సాగరాలు దాటి సైడ్-ఏ (Sapta Sagaralu Dhaati) అనే పేరుతో తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఇది తొలిపార్టు మాత్రమే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. మేకర్స్ రీసెంట్గా సెకండ్ పార్ట్ సంబంధించి విడుదల తేదీతో పాటు ఒక మెలోడి లాంటి టీజర్ వదిలారు. ఈ టీజర్ గాడిదా అంటూ.. మొదలు కాగా నాలుగు భాషల్లో టీజర్‌ను కట్ చేశారు. ఇక ఈ రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్-బీ (Sapta Sagaralu Dhaati Side-B) నవంబర్ 17న కన్నడతో పాటు మూడు భాషల్లో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ నుంచి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ ట్రైలర్‌ను (Sapta Sagaralu Dhaati Side-B Trailer) నవంబర్ 04 సాయంత్రం 6:06 గంటలకు విడుదల చేయనున్నట్లు రక్షిత్ శెట్టి (Rakshit Shetty) తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. ”క్యాసెట్‌ను తిప్పడానికి సిద్ధంగా ఉండండి” (సైడ్-బీ) నవంబర్ 4న సప్త సాగరదాచే ఎల్లో సైడ్ -బీ ట్రైలర్ వస్తుంది అంటూ రక్షిత్ శెట్టి రాసుకోచ్చారు.
Get ready to flip the cassette ☺️
Sapta Sagaradaache Ello Side – B trailer on 4th November 🤗#SSESideB #SSDSideB #EKTSideB pic.twitter.com/bA4lJI3jqw
— Rakshit Shetty (@rakshitshetty) November 3, 2023
ఈ సినిమా సప్త సాగరాలు దాటి సైడ్-ఏ కథ విషయానికొస్తే.. మను, ప్రియ అనే మధ్య తరగతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంటారు. పెళ్లిచేసుకుని జీవితంలో చాలా సాధించాలని, గొప్పగా ఎదగాలని కలలు కంటుంటారు. మరీ ముఖ్యంగా సముద్రం పక్కన ఓ అందమైన ఇల్లు కట్టుకుని కుంటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే ఓ రాంగ్ డిసీషన్ వల్ల వీళ్ల జీవితాలు తలకిందులైపోతాయి. రక్షిత్ శెట్టి జైలుకు అంకితమైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రక్షిత్ శెట్టి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకి జైలు నుంచి రక్షిత్ బయటకు వచ్చాడా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
Replaying dreams! For sometimes, that’s the only way to find comfort in reality!
The other side of life and Manu from Nov 17th! See you all soon 🤗
Here’s the LINK 🔗 https://t.co/xnEjPMPVfX #SSESideBNov17 @hemanthrao11 @rukminitweets @Chaithra_Achar_ @charanrajmr2701… pic.twitter.com/ne4hIZJMOw
— Rakshit Shetty (@rakshitshetty) October 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

