సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రియాంక దత్ నిర్మాత. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 18న విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవల చిత్ర టీజర్‌ను హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ఈ టీజర్లో రెండు భిన్నమైన కుటుంబాలు, వాటి మధ్య అనుబంధాలు, ఈ కుటుంబాల మధ్య ఓ అందమైన ప్రేమ జంట కథను చూపించారు. దర్శకురాలు నందిని రెడ్డి గత చిత్రాల తరహా సకుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. రావు రమేష్, నరేష్, గౌతమి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మిక్కీ జే మేయర్.