Gamblers Movie | జూన్ 6న రాబోతున్న సంగీత్ శోభన్ మిస్టరీ ఎంటర్టైనర్ ‘గ్యాంబ్లర్స్’
Gamblers Movie | 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంబ్లర్స్'.
Gamblers Movie | ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్ర శివ, శివారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ‘శ్రీవల్లి’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన సునీత, రాజ్‌కుమార్ బృందావనంలు ఈ చిత్రాన్ని రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మిస్తున్నారు. కేఎస్కే చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
దర్శకుడు కేఎస్కే చైతన్య మాట్లాడుతూ: “ఇదొక మిస్టరీ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో సంగీత్ శోభన్‌ను కొత్త కోణంలో చూస్తారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ఇటీవల ‘కేసీఆర్’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్ రాకేష్ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంది” అన్నారు.
నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ బృందావనం మాట్లాడుతూ: “‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో సంగీత్ శోభన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ ‘గ్యాంబ్లర్స్’ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
చిత్ర బృందం:
నటీనటులు: సంగీత్ శోభన్, ప్రశాంతి చారులింగ, రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్ర శివ, శివారెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుసూదన్ రావు, ఛత్రపతి శేఖర్, సూర్య భగవాన్ దాస్ తదితరులు.
నిర్మాతలు: సునీత, రాజ్‌కుమార్ బృందావనం
స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: కేఎస్కే చైతన్య
కథ – అదనపు స్క్రీన్‌ప్లే – సంభాషణలు: విజయ్ చిట్నీడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాష్
సంగీతం: శశాంక్ తిరుపతి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ప్రేమ్ సాగర్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
ఎడిటర్: శశాంక్ మాలి
యాక్షన్: వింగ్ చున్ అంజి
కొరియోగ్రఫీ: నిక్సన్ డి’క్రూజ్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వంత్ బైరీ, ప్రతిభా రెడ్డి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

