Super Subbu | మాకీపూర్లో సెక్స్ ఎడ్యుకేషన్.. నవ్వులు పూయిస్తున్న సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్
Sandeep Kishan | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. నెట్‌ఫ్లిక్స్ సంస్థ అందిస్తున్న మొట్టమొదటి ఒరిజినల్ తెలుగు సిరీస్ ఇదే కావడం విశేషం.
Sandeep Kishan | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. నెట్‌ఫ్లిక్స్ సంస్థ అందిస్తున్న మొట్టమొదటి ఒరిజినల్ తెలుగు సిరీస్ ఇదే కావడం విశేషం. తాజాగా ఈ సిరీస్ అఫీషియల్ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా విడుదల చేసింది. ‘డీజే టిల్లు’ ఫేమ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ కామెడీ డ్రామా సిరీస్‌ను తెరకెక్కించారు. బాలీవుడ్ ‘లిటిల్ థింగ్స్’ ఫేమ్ మిథిలా పాల్కర్ ఈ సిరీస్‌లో హీరోయిన్గా నటిస్తోంది.
ఒక అమాయక యువకుడు, అత్యంత సంప్రదాయ గ్రామం, అసాధ్యమైన ఓ ఉద్యోగం అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ సిరీస్ వస్తోంది. సుబ్రమణ్యం చిలుకూరి రావు అలియాస్ సుబ్బు అనే ఒక అమాయక పల్లెటూరి యువకుడికి ఎవరూ వెళ్లడానికి ఇష్టపడని ‘మాకీపూర్’ అనే వింత ఊరికి పోస్టింగ్ వస్తుంది. తన తండ్రి కుకటేశ్వరరావు ముందు పరువు నిలబెట్టుకోవాలని ఆ ఊరిలో అడుగుపెట్టిన సుబ్బుకి అక్కడ ఊహించని షాక్ తగులుతుంది. దేశంలోనే అత్యధిక సంతానోత్పత్తి రేటు ఉండి, జనాభా నియంత్రణ లేని ఆ ఊరి జనాలకి మనోడు సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా పాఠాలు చెప్పాల్సి వస్తుంది. ఒకవైపు జాబ్ టెన్షన్స్, లవ్ ప్రాబ్లమ్స్, ఇంకోవైపు ఊరి జనాల అపార్థాల మధ్య సుబ్బు పడే ఇబ్బందులు, క్రియేట్ చేసే కామెడీతో ఈ ట్రైలర్ నవ్వులు పూయించింది.
మిథిలా పాల్కర్ ఒక క్రేజీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, నటి అవ్వాలని కలలుకనే పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు కామెడీ కింగ్ బ్రహ్మానందం, వర్సటైల్ యాక్టర్ మురళీ శర్మ, గెటప్ శ్రీను, జీవన్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి ఈ సిరీస్‌ను నిర్మించారు. మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ సంయుక్తంగా దీనికి కథను అందించారు. ఈ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ జులై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

