Samyuktha hegde Injured | కన్నడ సోయగం సంయుక్త హెగ్డే షూటింగ్లో గాయపడింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా నటిస్తున్న ‘క్రీమ్’ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కాలు సరిగ్గా లాండింగ్ చేయకపోవడంతో కింద పడింది. దాంతో తన మోకాలికి గాయమైంది. ఈ విషయాలను స్వయంగా తనే చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో పంచుకుంది. ‘డాక్టర్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలిని చెప్పారని, తనకు గాయమైనా.. సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్ సీన్లను చూసి తనను మెచ్చుకుంటారని’ ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో తెలిపింది.
నిఖిల్ హీరోగా నటించిన ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో సంయుక్త తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చలాకిగా,అల్లరి పిల్లలా ఉండే పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కాలేజ్ కుమార్, వాచ్మెన్, కోమలి, తీల్ వంటి చిత్రాలతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆహాలో ఈమె నటించిన మన్మథ లీలా విడుదలై మంచి వ్యూవర్ షిప్ను సాధించింది. కిరాక్ పార్టీ తర్వాత ఇప్పటివరకు ఈమె తెలుగులో సినిమా చేయలేదు.